ఈ చిత్రానికి లభించే ఆదరణ సినీ రంగానికి స్ఫూర్తిని, స్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు: చిరంజీవి
- క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్
- ప్రధానపాత్రల్లో సాయితేజ్, నభా నటేశ్
- లాక్ డౌన్ తర్వాత వస్తున్న తొలిచిత్రం అంటూ చిరు వ్యాఖ్యలు
- ఇండస్ట్రీకి ఒక ముఖ్యమైన సందర్భమని వెల్లడి
- ప్రేక్షకులు బాధ్యతగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి
- భౌతికదూరం పాటిస్తూ ఎంజాయ్ చేయాలని సూచన
"లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిలిం ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తి, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే, ప్రేక్షకులందరూ బాధ్యతగా మాస్కులు ధరించి, భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ ఈ సినిమాను థియేటర్లతో హాయిగా ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాను" అని వివరించారు.