వర్షంతో పాటు మా ఇంటికి దేవి వచ్చింది: తమన్నా ఎమోషనల్ పోస్ట్

Tamannaah Bhatia emotional post on Devi coming home with the rain
  • ముంబైలోని తన ఇంట్లో లింగ భైరవి దేవి పుణ్య పూజ నిర్వహించిన తమన్నా
  • పూజ రోజున ముంబైలో వర్షం పడటం దైవ సంకేతంగా భావిస్తున్నానని వెల్లడి
  • వర్షంతో పాటే దేవి తన ఇంటికి వచ్చిందని నమ్మానంటూ భావోద్వేగ పోస్ట్
  • పూజ ముగిసినా ఇంట్లో దైవిక శక్తి నిలిచిపోయినట్టు అనిపించిందని వ్యాఖ్య
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా తన ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి, దాని వెనుక ఉన్న తన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముంబైలోని తన నివాసంలో లింగ భైరవి దేవి పుణ్య పూజను నిర్వహించగా, ఆ రోజు జరిగిన ఓ సంఘటనను దైవ సంకేతంగా ఆమె అభివర్ణించారు.

వివరాల్లోకి వెళితే, పూజకు ముందు ముంబైలో భరించలేని వేడి వాతావరణం ఉందని, పూజకు వచ్చిన అతిథులు ఇబ్బంది పడతారేమోనని తాను ఆందోళన చెందానని తమన్నా తన పోస్టులో తెలిపారు. అయితే, పూజ జరిగే రోజు ఉదయం నిద్రలేచి చూడగా, అనూహ్యంగా వర్షం కురిసిందని, వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "చెట్లు గాలికి ఊగుతున్నాయి, పువ్వులు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. కొన్ని రోజులుగా నగరాన్ని కమ్మేసిన వేడి మాయమైంది. పూజ గంటల తర్వాత మొదలైనా, వర్షంతో పాటే దేవి మా ఇంటికి వచ్చిందనిపించింది" అని తమన్నా రాసుకొచ్చారు.

పూజ పూర్తయి, అందరూ వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఏదో దైవిక శక్తి నిలిచిపోయినట్లు తనకు అనిపించిందని ఆమె పేర్కొన్నారు. "జపం ముగిసింది, పూజ పూర్తయింది. అయినా నేను దేవి పక్కనే కూర్చుండిపోయాను. ప్రార్థన, వేడుక, నవ్వులు, భక్తితో నిండిన ఆ ఇంటిలో ఇంకా ఏదో అందమైన అనుభూతి గాలిలో నిలిచిపోయినట్టు అనిపించింది" అని తమన్నా తన భావాలను వివరించారు. ఈ ప్రత్యేకమైన రోజును కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి జరుపుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని ఆమె తెలిపారు.
Go Back to Shorts
Tamannaah Bhatia
Linga Bhairavi Devi Puja
Tamannaah Mumbai Residence
Tamannaah Emotional Post
Linga Bhairavi Devi Blessings
Tamannaah Spiritual Experience
Mumbai Rains
Tamannaah Bhatia News
South Actress Tamannaah
Tamannaah Social Media Post

More Telugu News