భార్య జీన్స్ వేసుకోలేదని తలాక్.. ఆపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య జీన్స్ వేసుకోలేదని తలాక్.. ఆపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం!

Man divorce for wife not wearing jeans
  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
  • అత్తగారింటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం
  • తప్పిన ప్రమాదం
భార్య జీన్స్ ధరించి డ్యాన్స్ చేసేందుకు నిరాకరించడంతో ఓ భర్త కలత చెందాడు. ఆమెకు ముమ్మారు తలాక్ చెప్పాడు. అక్కడితో ఆగక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి న్యూ ఇస్లాం నగర్‌కు చెందిన అమీరుద్దీన్ కుమార్తె మహజబీకి ఎనిమిదేళ్ల క్రితం హాపూర్‌ పరిధిలోని పిల్‌ఖువాకు చెందిన అనస్‌తో వివాహమైంది. కొన్నాళ్ల వరకు భార్యతో అన్యోన్యంగా గడిపిన అనస్, గత కొంతకాలంగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. విషయం పెద్దలకు చేరడంతో వారు రాజీ కుదిర్చారు.

తాజాగా, అనస్ భార్యను మరో రకంగా వేధించడం మొదలుపెట్టాడు. జీన్స్ ధరించాలని, డ్యాన్స్ చేయాలని తరచూ ఒత్తిడి చేస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అత్తారింటికి వెళ్లిన అనస్ భార్యకు ముమ్మారు తలాక్ చెప్పాడు. అనంతరం తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. గాయాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Uttar Pradesh
Merut
Talak

More Telugu News