Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హారికకు ఆ విషయాన్ని చాలా సార్లు చెప్పాను: బిగ్ బాస్ విన్నర్ అభిజిత్

Harika is my sister says Abhijit
  • హారిక నాకు చెల్లెలు లాంటిది 
  • ఇదే విషయాన్ని ఆమెకు చాలాసార్లు చెప్పాను
  • అయితే ఈ విషయం బయటకు రాలేదు
దాదాపు మూడు నెలలకు పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. అభిజిత్ ఈ సీజన్ విన్నర్ గా నిలవగా, అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. వీరితో పాటు సొహేల్, అరియానా, హారికలు టాప్ ఫైవ్ లో నిలిచారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిజిత్ టీవీ చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హారిక తనకు చెల్లెలు లాంటిదని అభిజిత్ చెప్పాడు. ఇదే విషయాన్ని హౌస్ లో హారికకు తాను చాలా సార్లు చెప్పానని తెలిపారు. తనకు తమ్ముడు ఉన్నాడని, హారికలాంటి చెల్లెలు ఉంటే బాగుండేదని అనుకునేవాడినని చెప్పాడు. ఈ విషయాన్ని హారికకు చెప్పానని... అయితే తాను ఆమెతో చెపుతున్న ఈ మాటలు బయటకు రాలేదని అన్నాడు.  

మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ ఫుల్ జోష్ లో ఉన్నారు. వీరిలో చాలా మందికి ఇప్పటికే సినిమాలలో ఆఫర్లు వచ్చాయి.
Abhijit
Harika
Bigg Boss Telugu 4

More Telugu News