తన కుమార్తె మాలియా బాయ్ ఫ్రెండ్ ను గురించి చెప్పిన బరాక్ ఒబామా!

  • లాక్ డౌన్ సమయంలో మాతో ఉన్నాడు
  • బ్రిటన్ కు చెందిన మంచి యువకుడు
  • తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన పెద్ద కుమార్తె మాలియా బాయ్ ఫ్రెండ్ గురించి తన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. లాక్ డౌన్ సమయంలో అతను తమతోనే ఉన్నాడని చెప్పారు. తామంతా క్వారంటైన్ లో ఉన్న సమయంలో అతను కూడా తమతో పాటే గడిపాడని తెలిపారు. ఆ సమయంలో రోజూ రాత్రి వేళల్లో ఆటలాడుకున్నామని, పలు రకాల కళాకృతులను తయారు చేశామని, అయితే, కాలం గడిచేకొద్దీ వారు తమతో ఉండటాన్ని పెద్దగా ఇష్టపడలేదని ఒబామా అన్నారు.

అతని గురించి మరిన్ని వివరాలు చెబుతూ, "ఆ యువకుడు బ్రిటన్ జాతీయుడు. చాలా బాగుంటాడు. వీసా సమస్యల కారణంగా అతను అమెరికాలో చిక్కుకుపోయాడు. నేను పెద్దగా ఇష్టపడలేదుకానీ, చాలా మంచి కుర్రాడు. ఓ ఉద్యోగం సంపాదించే ప్రయత్నాల్లో ఉన్నాడు. బాగా తింటాడు. అతని కారణంగా మా నిత్యావసరాల బిల్లు 30 శాతం పెరిగింది" అని బరాక్ ఒబామా చలోక్తులు విసిరారు.

ఒబామా, మిచెల్ దంపతులకు వివాహమై 28 సంవత్సరాలు గడుస్తుండగా, వారికి మాలియా (22), సాషా (19) కుమార్తెలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాను రచించిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం ప్రమోషన్ నిమిత్తం ఆయన పలు మీడియా సంస్థలు, టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా కాలం గడుపుతున్నారు.

Barak Obama
Malia
Boy Friend

More Telugu News