'వకీల్ సాబ్' నుంచి పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ పిక్ లీక్!

Another Leak from Vakeel Saab
  • ఓ సాంగ్ చిత్రీకరణలోని దృశ్యం 
  • శ్రుతిహాసన్ చెయ్యి పట్టుకుని ఉన్న పవన్
  • ఇప్పటికే సినిమాపై పలు లీక్ లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'వకీల్ సాబ్' షూటింగ్ ప్రారంభం నుంచి లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఓ పాట చిత్రీకరణ సమయంలో శ్రుతిహాసన్ తో పవన్ కలసి ఉన్న ఓ చిత్రం లీక్ అయింది. ఇందులో వీరిద్దరూ ఒకరి చెయ్యిని మరొకరు పట్టుకుని కనిపిస్తున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, శ్రుతిహాసన్ తో ఇది పవన్ కు మూడో చిత్రమన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన 'పింక్' రీమేక్ గా ఇది రూపొందుతుండగా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజులు నిర్మాతలు.
Go Back to Shorts
Vakeel Saab
Pawan Kalyan
Sruthi Hasan
Leak

More Telugu News