ఎన్నికల గుర్తు కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల హాసన్

  • మక్కల్ నీది మయ్యం ఎన్నికల గుర్తుగా బ్యాటరీ టార్చ్‌లైట్ ఉండాలి
  • ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలి
  • ఎంజీఆర్ మక్కల్ కట్టి బ్యాటరీ గుర్తును వాడకుండా ఆదేశించాలి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టిన మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమల హాసన్ పార్టీ గుర్తుపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మక్కల్ నీది మయ్యం ఎన్నికల గుర్తుగా బ్యాటరీ టార్చ్‌లైట్ కోసం ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.

తమకు ఆ గుర్తునే కేటాయించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరోపార్టీ ఎంజీఆర్ మక్కల్ కట్టి బ్యాటరీ గుర్తును వాడకుండా ఆదేశించాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

Kamal Haasan
High Court
Tamilnadu

More Telugu News