కెనడా టూర్ రద్దు చేసుకుని ఢిల్లీ సరిహద్దుల్లో చేరిన సెలూన్ యజమాని... ఏం చేస్తున్నాడంటే..!
- హర్యానాలోని కురుక్షేత్రలో సెలూన్ నిర్వహిస్తున్న లాబ్ సింగ్
- లాబ్ సింగ్ కస్టమర్లలో అత్యధికులు రైతులే
- ఢిల్లీ బాట పట్టిన రైతులు
- వారితో పాటే సింఘు ప్రాంతానికి వచ్చిన లాబ్ సింగ్
- భార్య పుట్టినరోజు వాయిదా
ముఖ్యమైన విషయం ఏంటంటే... లాబ్ సింగ్ తన భార్య పుట్టినరోజును కెనడాలో వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన కస్టమర్లు నిరసనల్లో పాల్గొంటుండడంతో వారికి సంఘీభావంగా తాను కూడా వారి వద్దకే చేరుకున్నాడు. ఈ క్రమంలో తన కెనడా పర్యటనను కూడా రద్దు చేసుకున్నాడు. ప్రతి ఏటా తన భార్య జన్మదిన వేడుకలను విదేశాల్లో జరుపుకునే లాబ్ సింగ్ ఈసారి రైతుల కోసం తన వ్యక్తిగత సంతోషాలను త్యాగం చేశాడు.