పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు.. ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్
- సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
- ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న సీఎం
- రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా జరగాలని ఆదేశించిన కేసీఆర్
ఇకపై స్లాట్ బుకింగ్ లు అడగవద్దని.. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను చేయాలని కేసీఆర్ అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం యథాతథంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్నాళ్ల పాటు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది.