జనవరి మొదటివారంలో హైదరాబాదులో ఉచిత తాగునీటి సరఫరా పథకం ప్రారంభం: కేటీఆర్ వెల్లడి
- నగరంలో 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఫ్రీ
- సీఎం కేసీఆర్ హామీ అమలు చేస్తున్నామన్న కేటీఆర్
- జలమండలి అధికారులతో సమీక్ష
- డిసెంబరు నెల బిల్లుపై ప్రత్యేక ఆదేశాలు
- 20 వేల లీటర్ల వరకు రుసుము వద్దని స్పష్టీకరణ
సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు నెల నుంచి 20 వేల లీటర్ల వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ ఈ పథకంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ పథకం అమలుకు రాబోయే రెండు వారాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.