రెండు ఎన్నికల్లో గెలుపుకే బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు: తలసాని
- కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు
- కేసీఆర్ ను అరెస్ట్ చేస్తాం అంటున్నారు
- అంత ధైర్యం మీకు ఉందా?
కేవలం రెండు ఎన్నికల్లో గెలుపుకే బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని ఆకుపాముల గ్రామంలో పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశమంతా గర్వించేలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నో ఎన్నికలను చూసిందని, ఒకట్రెండు ఎన్నికలు టీఆర్ఎస్ ను ఏమీ చేయలేవని అన్నారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని బీజేపీ నేతలు అంటున్నారని... కేసీఆర్ ను అరెస్ట్ చేసేంత ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు.