ఏపీ కరోనా అప్ డేట్: 458 మందికి పాజిటివ్, ఒకరి మృతి
- గత 24 గంటల్లో 69,062 కరోనా టెస్టులు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 98 కేసులు
- అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 6 కేసులు
- తాజాగా 534 మందికి కరోనా నయం
- ఇంకా 4,377 మందికి చికిత్స
అదే సమయంలో 534 మందికి కరోనా నయం కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,77,806 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,66,359 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,377కి తగ్గింది. మొత్తం మరణాల సంఖ్య 7,070కి చేరింది.