సుప్రీంలో ఓటుకు నోటు కేసు: చంద్రబాబును నిందితుడిగా చేర్చాలనే పిటిషన్ వచ్చే ఏడాది జులై 17కు వాయిదా!
- మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
- ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు
- ఎర్లీ హియరింగ్ పిటిషన్ విచారణను ముగించిన ధర్మాసనం
రాజకీయనేతల ప్రమేయం ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పిటిషనర్ తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నప్పటికీ తెలంగాణ ఏసీబీ కూడా ఆయన పేరును చేర్చలేదని కోర్టుకు తెలిపారు. స్పందించిన న్యాయస్థానం కేసును జులైలో విచారిస్తామని చెబుతూ ‘ఎర్లీ హియరింగ్ అప్లికేషన్’పై విచారణ ముగిస్తున్నట్టు తెలిపింది.