కరోనా వైరస్‌పై వాట్సాప్‌లో దుష్ప్రచారం.. ఎలక్ట్రీషియన్ అరెస్ట్
- భయం గొల్పేలా ఉన్న వాయిస్ మెసేజ్‌లు
- స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేసిన సాదిక్
- అరెస్ట్ చేసి రిమాండుకు పంపిన పోలీసులు
కరోనాకు సంబంధించి ఇటీవల అతడికి వాట్సాప్‌లో రెండు వాయిస్ మెసేజ్‌లు వచ్చాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ మెసేజ్‌లను సాదిక్ తన స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేశాడు. ఇది పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తమకు దొరికిన సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సాదిక్ బాషాను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు.