24 గంటల్లో కేసీఆర్, డీజీపీ స్పందించాలి.. లేకపోతే ఉద్యమం తప్పదు: బండి సంజయ్
- కాళీమాత ఆలయ భూముల కబ్జాపై 24 గంటల్లో స్పందించాలి
- కబ్జాకు సహకరించిన డీసీపీని సస్పెండ్ చేయాలి
- మా సహనం నశిస్తే ఏమవుతుందో పోలీసులు ఆలోచించుకోవాలి
కాళీమాత భూముల కబ్జాకు సహకరించిన డీసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన మహిళలపై డీసీపీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఎంఐఎంకు డీసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాషాయ వస్త్రాలను ధరించినంత మాత్రాన కేసీఆర్ హిందువు కాలేరని చెప్పారు. హిందువో, బొందువో అనేది కేసీఆరే తేల్చుకోవాలని అన్నారు. తమ సహనం నశిస్తే పాతబస్తీ ఏమవుతుందో పోలీసులు ఆలోచించుకోవాలని చెప్పారు. మరోపక్క, ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.