మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసిన మోహన్ రాజా
- చిరంజీవి 153వ చిత్రం 'లూసిఫర్'కు దర్శకుడు ఖరారు
- 'హనుమాన్ జంక్షన్' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మోహన్ రాజా
- 'హిట్లర్'కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రాజా
మరోవైపు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన మోహన్ రాజా (నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు) 'హనుమాన్ జంక్షన్' సినిమా ద్వారా తెలుగు సీనీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగులో విజయవంతమైన పలు చిత్రాలను ఆయన తమిళంలో రీమేక్ చేశారు. చిరంజీవి నటించగా, తన తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మించిన 'హిట్లర్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. చిరంజీవిని డైరెక్ట్ చేయడంపై ఆయన స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించడానికి తనకు ఇంత కాలం పట్టిందని చెప్పారు. ఈ సినిమాకు ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.