లాలూ ప్రసాద్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది: డాక్టర్ ఉమేశ్ ప్రసాద్
- ఆయన కిడ్నీలు 25 శాతం మేరకే పని చేస్తున్నాయి
- పరిస్థితి ఎప్పుడైనా క్షీణించే అవకాశం ఉంది
- వేరే చోట చికిత్స చేయించినా ఫలితం ఉండక పోవచ్చు
గత 20 ఏళ్లుగా లాలూ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని ప్రసాద్ చెప్పారు. ఆయన పరిస్థితి ఏ క్షణంలోనైనా విషమించే అవకాశం ఉందని రిమ్స్ కు తెలియజేశానని అన్నారు. చికిత్స కోసం ఆయనను ఎక్కడకూ తరలించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. వ్యాధిని ఏ మందూ నయం చేయలేదని.. వేరోచోట చికిత్స చేయించినా ఫలితం ఉండక పోవచ్చని అన్నారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలంటూ లాలూ తరపు న్యాయవాది వేసిన పిటిషన్ పై విచారణను ఝార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది.