బీజేపీకి కేసీఆర్ మేయర్ పదవిని ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోంది: మధు యాష్కి
- కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాళ్ల బేరానికి దిగుతున్నారు
- సింగిల్ గా అమిత్ షాను కలవడంలో అర్థం ఏమిటి?
- కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం యత్నిస్తున్నాయి
బీజేపీకి హైదరాబాద్ మేయర్ పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోందని మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూకబ్జా కేసు నమోదైన మంత్రి మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలకు పాల్పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకపోతే ప్రజలే కేసీఆర్ గడీలను పగలగొడతారని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గం అలీబాబా నలభై దొంగల మాదిరి తయారైందని అన్నారు.