కేసీఆర్ అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిర్శనం: జగ్గారెడ్డి

Jagga Reddy fires on KCR
  • సోనియా ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు
  • ఇతర నియోజకవర్గాలు కేసీఆర్ కు అవసరం లేదా?
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వడం లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధిపేట లేనిదే కేసీఆర్ లేడని... కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. సిద్ధిపేట లేనిదే కేసీఆర్ లేడనే విషయం నిజమని... కానీ, కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదనే మాట మాత్రం అవాస్తవమని చెప్పారు. కేసీఆర్ అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని మండిపడ్డారు. సోనియాగాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని... తెలంగాణ రాకపోతే కేసీఆర్ ఇంత అహంకారంతో మాట్లాడేవారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదని అన్నారు.

సిద్ధిపేట, గజ్వేల్ మినహా మెదక్ జిల్లాలో ఇతర నియోజకవర్గాలు కేసీఆర్ కు అవసరం లేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఆ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Jagga Reddy
Congress
KCR
TRS

More Telugu News