రజనీకాంత్ పార్టీ చిహ్నం రెడీ... సైకిల్, పాల క్యాన్ తో తలైవా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ పార్టీ చిహ్నం రెడీ... సైకిల్, పాల క్యాన్ తో తలైవా!

Rajani Party Symbol is Cycle with Milk Can
  • 'అన్నామలై' చిత్రంలో అభిమానులను అలరించిన గెటప్
  • దాన్నే గుర్తుగా తీసుకోవాలన్న పార్టీ సమావేశం
  • తుది నిర్ణయం తీసుకోనున్న రజనీకాంత్
తమిళనాడు రాజకీయాల్లోకి ఈ నెలాఖరులో ప్రవేశిస్తానని స్వయంగా ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు పార్టీ గుర్తు, జెండాపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా, తనకు అత్యంత సన్నిహితులైన అర్జున్ మూర్తి, తమిళ రవి మణియన్ లు సహా, మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శలతో భేటీ అయి, గంటల పాటు సమావేశం జరిపిన ఆయన, ప్రజలను ఆకట్టుకునేలా గుర్తు, జెండా ఉండాలని నిర్ణయించారు.

ఇక పార్టీ చిహ్నంగా సైకిల్ ను ఎంచుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారు నిర్ణయించుకోగా, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అదే గుర్తు ఉండటంతో అభ్యంతరాలు, వివాదాలు తలెత్తవచ్చన్న కోణంలోనూ వీరు చర్చించారు. ఇదే సమయంలో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'అన్నామలై' చిత్రంలో అభిమానులను ఎంతో అలరించిన సైకిల్, పాలక్యాన్, రజనీ గెటప్ ను చిహ్నంగా ఎంచుకోవాలని వీరంతా భావిస్తున్నట్టు సమాచారం. సమావేశంలో పాల్గొన్న వారంతా గుర్తు విషయంలో ఏకాభిప్రాయానికి రాగా, అతి త్వరలోనే రజనీ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ ప్రతినిధులు తెలిపారు.

ఇదిలావుండగా, రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ, నిన్న తిరువణ్ణామలైకు వచ్చి, అరుణ గిరినాథర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నెల 31న రజనీ నుంచి రాజకీయ ప్రకటన రావడం ఖాయమన్నారు. ఆయన పార్టీని ప్రకటించగానే, పలువురు ప్రముఖులు చేరనున్నారని తెలిపారు. ఆధ్యాత్మికతను నమ్మని ద్రవిడ పార్టీలకు అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయని, తిరువణ్ణామలై నుంచి రజనీ పోటీ చేస్తారా? లేదా? అన్నది దేవుడి నిర్ణయమని తెలిపారు.
Rajanikant
Makkal Mandram
Cycle
Milk Can

More Telugu News