వైసీపీ ఎంపీ మాధవ్ కు వార్నింగ్ ఇచ్చిన పరిటాల సునీత
- పరిటాల రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గోరంట్ల మాధవ్
- ఇంకోసారి రవి గురించి మాట్లాడితే ఊరుకోబోమన్న సునీత
- రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావని ప్రశ్న
ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, పరిటాల రవి భార్య పరిటాల సునీత మండిపడ్డారు. నీ చరిత్ర ఏమిటో మాకు తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ మాదిరి రోడ్డెక్కి మాట్లాడి, విలువను తగ్గించుకోలేమని అన్నారు. ఇంకోసారి రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రవి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావని మండిపడ్డారు. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఎస్సీలు, ఎస్టీలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి.