సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కలకలం.. కాల్పులు జరిపిన భారత్
- జమ్మూ కశ్మీర్‌లోని రణబీర్ సింగ్ పురా సెక్టార్ వద్ద ఘటన
- పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతోన్న సరిహద్దు భద్రతా దళాలు
- పదే పదే డ్రోన్లతో పాక్ దుందుడుకు చర్యలు
తాజాగా, ఓ డ్రోన్ కనపడడంతో వెంటనే అప్రత్తమైన బీఎస్ఎఫ్ కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ తిరిగి అక్కడి నుంచి పాక్‌లోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. పాక్ పదే పదే ఈ చర్యలకు పాల్పడుతోందని, గత నెల 21న మెన్దార్ సెక్టార్‌లోనూ డ్రోన్ కదలికలను గుర్తించి, దీటుగా సమాధానం చెప్పామని తెలిపారు. అంతకుముందు సెప్టెంబరులోనూ సాంబా సెక్టార్ వద్ద రెండు పాక్ డ్రోన్లు తిరుగుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు.