Ram Gopal Varma: అరియానాకు ఓటు వేసి గెలిపించండి: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma supprts Ariana
  • చివరి అంకానికి చేరుకున్న బిగ్ బాస్
  • అరియానాకు మద్దతు పలికిన రామ్ గోపాల్ వర్మ
  • విజేతగా నిలిచే అర్హత ఉందని వ్యాఖ్య
బిగ్ బాస్ సీజన్-4  చివరి అంకానికి  చేరుకుంది. అభిజిత్, సొహైల్, అఖిల్, హారిక, మోనల్, అరియానాలు షోలో మిగిలారు. తొలి ఫైనల్ కంటెస్టెంట్ గా అఖిల్ నిలిచాడు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అరియానాకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు పలికాడు.

అరియానాకు ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచే అర్హత అరియానాకు ఉందని ట్వీట్ చేశాడు. దీంతో పాటు అరియానాకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఈ వారం గట్టెక్కితే అరియానా ఫైనల్స్ లోకి అడుగుపెడుతుంది.
Ram Gopal Varma
Ariana
Bigg Boss Telugu 4
Tollywood

More Telugu News