చివరికి ఈ ప్రభుత్వం రైతులపై రాళ్లు వేయించే స్థితికి వచ్చింది: జగన్ సర్కారుపై 'సీపీఐ' రామకృష్ణ విమర్శలు
- ఏ పోరాటం కూడా 12 నెలలు జరగలేదన్న రామకృష్ణ
- అమరావతి పోరు చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడి
- సీఎం అసత్యప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- భారత్ బంద్ కు అమరావతి రైతులు మద్దతివ్వాలని సూచన
అటు, టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందిస్తూ.... ప్రపంచంలో ఏ దేశ రైతులు ఇన్ని భూములు ఇవ్వలేదని అన్నారు. ఉద్యమంలో రైతుల కన్నీళ్లు, రక్తం వృథాగా పోవు అని పేర్కొన్నారు. అమరావతిపై వైసీపీ మంత్రుల అసత్య ప్రచారాలు ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు పెంచుకునేందుకే విశాఖకు రాజధాని తరలిస్తున్నారని ఆరోపించారు.