జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్‌పై కిడ్నాప్ కేసు నమోదు
- సోదరి భర్తను కిడ్నాప్ చేసి, దాడి చేసినట్టు కేసు
- కారులో తీసుకెళ్లారన్న బాధితుడు రవి కుమార్
- కార్తీతో పాటు ఆయన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు
ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ, తన సోదరి భర్తపై స్నేహితులతో కలిసి కార్తీక్ దాడి చేసినట్టు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. ఐదుగురు వ్యక్తులతో కలసి కార్తీక్ దాడి చేశాడని బాధితుడు రవి కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. తనను కిడ్నాప్ చేసి 15 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లారని, అక్కడ తనను కొట్టించాడని చెప్పారు. కార్తీక్ తో పాటు, అతని తల్లిదండ్రులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే ఈ ఘటనపై కార్తీక్ ఇంకా స్పందించలేదు.