‘రామన్ ఎఫెక్ట్’తో కరోనా నిర్ధారణ: ఐఐఎస్సీ
- వైరస్‌ను గుర్తించేందుకు సరికొత్త విధానంవైపు ఐఐఎస్సీ శాస్త్రవేత్తల దృష్టి
- ఆర్ఎన్ఏను వేరు చేయాల్సిన అవసరం లేకుండానే వైరస్ గుర్తింపు
- రామన్ ఎఫెక్ట్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
రామన్ ఎఫెక్ట్‌కు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను జోడించి పూర్తి కచ్చితత్వంతో వేగంగా, అత్యంత చవకగా కరోనా పరీక్షలు చేసే దిశగా ప్రయోగాలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ విధానంలో నమూనాల నుంచి ఆర్ఎన్ఏను వేరు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాగా, ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా చెదిరిపోతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. రామన్ కనుగొన్న ఈ సూత్రం ‘రామన్ ఎఫెక్ట్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1930లో ఈ ‘రామన్ ఎఫెక్ట్’కు నోబెల్ బహుమతి లభించింది.