రేపు ఏలూరుకు సీఎం జగన్... బాధితులకు పరామర్శ

CM Jagan decides to go Eluru on Monday
  • ఏలూరులో వింత జబ్బు విజృంభణ
  • వ్యాధి బారినపడిన 300 మంది
  • ఏలూరు ఆసుపత్రుల్లో చికిత్స
  • ఇప్పటికే ఆరోగ్యశాఖమంత్రికి ఫోన్ చేసిన సీఎం జగన్
వైద్య నిపుణులకు కూడా అంతుబట్టని రీతిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి ప్రబలడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఏలూరులో పర్యటించనున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి ఏలూరులో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

కాగా, మంగళగిరి ఎయిమ్స్ నుంచి సీనియర్ డాక్టర్ల బృందం ఏలూరు బయల్దేరింది. అక్కడ బాధితుల పరిస్థితిని వారు సమీక్షించనున్నారు. వింత జబ్బుకు గల కారణాలను విశ్లేషించనున్నారు. ఇప్పటివరకు ఏలూరులో బాధితుల సంఖ్య 300కి పెరిగింది.
Go Back to Shorts
Jagan
Eluru
Decease
YSRCP
Andhra Pradesh

More Telugu News