కలకలం రేపిన ఏలూరు ఘటనలో 20 మంది డిశ్చార్జ్
- అంతుచిక్కని కారణాలతో వంద మందికిపైగా ఆసుపత్రిలో చేరిక
- అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు
- ఆందోళన అవసరం లేదన్న వైద్యులు
సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇన్‌చార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్య బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు చెప్పారు.