బిల్లులపై తొందరపాటు నిర్ణయాలుకూడదు: వ్యవసాయ చట్టాలపై చంద్రబాబు
- పాలకుల నిర్ణయాలు రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలి
- రైతులు, రైతు సంఘాల ఏకాభిప్రాయం సాధించాలి
- కొత్త చట్టాలు రైతులకు శాపంగా మారకూడదు
అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మేలైన విధానాలను తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు నూతన వ్యవసాయ చట్టాలు మరింత భారంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.