భారత్లో వ్యాక్సిన్ను ఇలా పంపిణీ చేస్తారు.. వీడియో ఇదిగో
- వ్యాక్సిన్ పంపిణీలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోది కీలక పాత్ర
- ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఎయిర్ కార్గోది కూడా
- ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టైమ్ అండ్ టెంపరేచర్ సెన్సిటివ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ అభివృద్ధి
ప్రజలకు వాటిని అందించే ప్రక్రియలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పేద, మధ్య ఆదాయ దేశాల్లో అందుకు తగ్గ వసతుల లేమి ఆందోళనకరంగా మారింది. వ్యాక్సిన్ను భారత్లో కొన్ని వారాల్లోనే పంపిణీ చేసే అవకాశం ఉందని అఖిల పక్ష భేటీలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
వ్యాక్సిన్ పంపిణీలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఎయిర్ కార్గో భారత్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టైమ్ అండ్ టెంపరేచర్ సెన్సిటివ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ను అభివృద్ధి చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ ను ఎలా సరఫరా చేయాలన్న విషయంపై ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను జీఎంఆర్ విడుదల చేసింది.