నాగశౌర్య తాజా చిత్రం 'శ్రీకృష్ణ-సత్యభామ'?
- 'వరుడు కావలెను', 'లక్ష్య' చిత్రాలలో నాగశౌర్య
- అనీష్ కృష్ణ దర్శకత్వంలో తాజా చిత్రం
- శ్రీకృష్ణ, సత్యభామలను పోలిన పాత్రలు
- హైదరాబాదులో రెగ్యులర్ షూటింగ్
ఆక్లాండ్ కు చెందిన పాప్ సంచలనం షెర్లీ సేషియా ఇందులో కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరో పాత్ర శ్రీకృష్ణుడు, హీరోయిన్ పాత్ర సత్యభామ తరహా పురాణ పాత్రలను గుర్తుకు తెస్తాయట. దాంతో దీనికి 'శ్రీకృష్ణ-సత్యభామ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కథకు ఇది బాగా సూటవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీనికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.