కరోనా వ్యాక్సిన్ కు అనుమతినిచ్చిన తొలి దేశంగా బ్రిటన్
- ఫైజర్ వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన యూకే
- తొలుత ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించనున్న బ్రిటన్ వ్యాక్సిన్ కమిటీ
- కరోనాపై పోరాటంలో ఇదొక గొప్ప మలుపు అన్న యూకే
తొలి విడతలో వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని బ్రిటన్ కు చెందిన వ్యాక్సిన్ కమిటీ నిర్ధారించనుంది. తొలుత వృద్ధులకు ఇవ్వాలా? హెల్త్ కేర్ స్టాఫ్ కి ఇవ్వాలా? అనే విషయంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
వ్యాక్సిన్ 90 శాతం పక్కాగా పని చేస్తోందని ఫైజర్ తో పాటు, యూఎస్ కు చెందిన బయోటెక్ ఫర్మ్ మోడెర్నా తన ప్రాథమిక నివేదికలో తెలిపింది. మరోవైపు దీనిపై యూకే ప్రభుత్వం స్పందిస్తూ... కరోనాపై జరుగుతున్న పోరాటంలో ఇదొక గొప్ప మలుపు అని తెలిపింది.