టీమిండియా-ఆసీస్ మ్యాచ్ లో అందరి దృష్టి ఆకర్షించిన ప్రేమ జంట!
- సిడ్నీలో నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్
- విజయం సాధించిన ఆతిథ్య జట్టు
- గ్యాలరీలో తన ప్రియురాలికి ప్రపోజ్ చేసిన టీమిండియా అభిమాని
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ సన్నివేశాన్ని మైదానంలోని భారీ తెరపై చూపించడంతో ఆటగాళ్లు సైతం ఎంజాయ్ చేశారు. ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ చప్పట్లు కొట్టి ఆ ప్రేమజంటను అభినందించారు. సాధారణంగా సోషల్ మీడియాలో మ్యాచ్ కు సంబంధించిన అంశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకు భిన్నంగా ప్రేక్షకుల గ్యాలరీలో జరిగిన ఈ ఘటన అత్యధికంగా దర్శనమిస్తోంది.