తమిళనాడులో 10వ శతాబ్దానికి చెందిన వర్ధమాన మహావీరుడి విగ్రహం లభ్యం
- దట్టమైన అడవుల్లో విగ్రహం
- సగం వరకు మట్టిలో కూరుకుపోయిన వైనం
- విగ్రహం పురాతనమైనదని తేల్చిన నిపుణులు
స్థానికులు ఈ విగ్రహాన్ని బుద్ధ ప్రతిమ అనుకున్నారు. దీన్ని పరిశీలించిన నిపుణులు తమిళ జైనులు విలసిల్లిన కాలం నాటిదని వెల్లడించారు. విగ్రహ నిర్మాణ శైలి, శిల్పకళ మొదలైన అంశాల ఆధారంగా అది 10వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. కాగా, ఈ విగ్రహం లభ్యమైన విషయాన్ని జీవన్ కుమార్ జైన మఠానికి తెలియజేశారు. ఈ మహావీర విగ్రహాన్ని సంరక్షించేందుకు అక్కడ ఓ నిర్మాణం చేపట్టనున్నారు.