18 నెలల కాలంలో అనేక తుపాన్లు వచ్చినా ఒక్క రూపాయి రాల్చిన పాపానపోలేదు: బోండా ఉమ
- ఏపీని కుదిపేసిన నివర్
- గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎవర్నీ ఆదుకోలేదన్న ఉమ
- వరద బాధితులకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్
గతంలో వరదల్లో నష్టపోయిన వారికి రూ.500 ఇస్తామంటే కనీసం రూ.5000 ఇవ్వాలని ప్రకటన చేసిన జగన్, ఇప్పుడెందుకు రూ.500 ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు రూ.500 ఏంటి?... రూ.5 వేలు ఇవ్వాల్సిందే అని బోండా ఉమ డిమాండ్ చేశారు.