సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- దక్షిణాదికి దూరం కానంటున్న తాప్సి
- నాని సినిమాలో ముగ్గురు నాయికలు
- 'జార్జిరెడ్డి' హీరో రొమాంటిక్ సినిమా
* నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో ఇప్పటికే సాయిపల్లవి, కృతి శెట్టిలను కథానాయికలుగా ఎంపిక చేశారు. మూడో కథానాయిక పాత్ర కూడా ఉండడంతో ఆ పాత్రకు అదితిరావు హైదరి, నివేద థామస్ లను పరిశీలిస్తున్నారట. త్వరలో వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
* 'వంగవీటి', 'జార్జిరెడ్డి' చిత్రాల హీరో సందీప్ మాధవ్ తాజాగా మరో చిత్రానికి సంతకం చేశాడు. నూతన దర్శకుడు మధు కిరణ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది.