సినిమాలు వదిలేసి అమెరికాకు వెళ్లిపోవడానికి కారణం ఇదే: రిచా గంగోపాధ్యాయ
- మార్కెటింగ్ లో ఎంబీఏ చేయాలనేది నా కల
- ఎంబీఏ అవకాశం రావడంతో అమెరికాకు వెళ్లిపోయా
- నా క్లాస్ మేట్ నే ప్రేమపెళ్లి చేసుకున్నా
తనకు చదువంటే ఇష్టమని... మార్కెటింగ్ లో ఎంబీఏ చేయాలనేది తన చిన్ననాటి కల అని రిచా తెలిపింది. ఎంబీఏ చదివే అవకాశం రావడంతో అమెరికాకు వెళ్లిపోయానని చెప్పింది. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపించిందని తెలిపింది. ఎంబీఏలో తన క్లాస్ మేట్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెప్పింది. సినిమాలకు దూరమయ్యాననే బాధ తనలో లేదని... తన జీవితం ప్రస్తుతం సాఫీగా సాగుతోందని తెలిపింది.