చిరంజీవి సినిమాలో కథానాయిక ఉండదా?
- 'ఆచార్య' తర్వాత చిరంజీవి రెండు రీమేక్స్
- 'లూసిఫర్'కి మోహన్ రాజా దర్శకత్వం
- 'లూసిఫర్' మాతృకలో లేని నాయిక పాత్ర
- తెలుగులో కూడా నాయిక పాత్ర లేనట్టే!
ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరంజీవి దీని తర్వాత 'వేదాళం', 'లూసిఫర్' రీమేక్స్ చేయనున్నారు. ఇందులో మలయాళ సినిమా 'లూసిఫర్'కి తమిళ యువ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ సినిమా మాతృకలో హీరో పాత్ర సరసన హీరోయిన్ ఉండదు.
అయితే, తెలుగుకి వచ్చేటప్పటికి హీరోయిన్ పాత్రను క్రియేట్ చేద్దామని మొదట అనుకున్నారట. తీరా ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుని, మాతృకకు పెద్దగా మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా చిరంజీవి సరసన కథానాయిక ఎవరూ ఉండరని అంటున్నారు. అందుకే, ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్లో వెరైటీ అవుతుందనే చెప్పాలి!