ఆంధ్ర, రాయలసీమ ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలి: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
- దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కాబోతోంది
- హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
- కేంద్ర నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోంది
గ్రేటర్ హైదరాబాద్ ను గ్రేట్ గా మార్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఆదినారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలంతా బీజేపీకే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చే నోట్లను తీసుకుని... బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పారు. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. మరోవైపు గ్రేటర్ లో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.