బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్...17 మంది మృతి
- బమియాన్ నగరంలో శక్తిమంతమైన పేలుళ్లు
- నెత్తురోడిన నగరం
- 50 మంది వరకు గాయాలపాలు
ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్ నగరంలో ఎక్కువగా షియా హజారా వర్గం ప్రజలు నివసిస్తుంటారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రముఖ పర్యాటక స్థలంగా బమియాన్ పేరొందింది. అంతేకాదు, దేశంలోనే అత్యంత భద్రమైన చోటుగా భావించే బమియాన్ లో బాంబు పేలుళ్లు జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.