ఇక 'బంగార్రాజు' మొదలెట్టనున్న నాగార్జున!

Nagarjuna to start Bangarraju
  • ప్రస్తుతం 'వైల్డ్ డాగ్'లో నటిస్తున్న నాగ్  
  • డిసెంబర్ తొలివారం నుంచి 'బంగార్రాజు'
  • 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ఇది సీక్వెల్
  • కీలక పాత్రలో నటించనున్న రమ్యకృష్ణ     
ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న అక్కినేని నాగార్జున దీని తర్వాత 'బంగార్రాజు' చిత్రాన్ని చేయనున్నారు. దీనికి కల్యాణ్ కృష్ణ దర్శకుడు. ఆమధ్య నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం మంచి హిట్టయిన సంగతి విదితమే. ముఖ్యంగా ఇందులో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర, ఆ గెటప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దాంతో ఆ పాత్రను బేస్ చేసుకుని, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా దీని స్క్రిప్ట్ పనితో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగును ప్రారంభిస్తారని, దాదాపు సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగును పూర్తి చేస్తారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో నటించిన ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో కూడా కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం.  
Go Back to Shorts
Nagarjuna
Ramyakrishna
Kalyan Krishna

More Telugu News