ఏపీ కరోనా అప్ డేట్: 1,160 పాజిటివ్ కేసులు, 7 మరణాలు

AP Corona Bulletin
  • గత 24 గంటల్లో 68,307 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 189 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కేసులు
ఏపీలో గడచిన 24 గంటల్లో 68,307 కరోనా టెస్టులు నిర్వహించగా 1,160 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 189 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,765 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,927కి పెరిగింది.

ఇప్పటివరకు ఏపీలో 8,61,092 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,39,395 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 14,770 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Bulletin
Update
Positive Cases
Deaths

More Telugu News