బండి సంజయ్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: మంత్రి జగదీశ్వర్ రెడ్డి
- గుడి పేరుతో అబద్ధాలాడటం బీజేపీకి అలవాటే
- సంజయ్ తనకు తాను పెద్ద నేతగా ఊహించుకుంటున్నారు
- మోదీని కూడా ఒవైసీ కలిశారు
బండి సంజయ్ తనకు తాను ఒక పెద్ద నాయకుడిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎంతో కేసీఆర్ కు అవగాహన ఉందని బండి సంజయ్ అంటున్నారని... ప్రధాని మోదీని కూడా అసదుద్దీన్ ఒవైసీ కలిశారని, అసదుద్దీన్ తో మోదీ ఎందుకు సమావేశమయ్యారో సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనవసర విషయాలను వదిలేసి... అభివృద్ధి గురించి మాట్లాడాలని హితవు పలికారు.