హాట్ కేకుల్లా అమ్ముడైన టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ల టికెట్లు
- నవంబరు 27 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లు
- 5 మ్యాచ్ లకు టికెట్లు మొత్తం అమ్మకం
- ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్ కు అనుమతి
మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల టికెట్లను విక్రయానికి పెట్టగా, 5 మ్యాచ్ ల టికెట్లు తొలిరోజే అమ్ముడయ్యాయి. అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేవలం తొలి వన్డేకు సంబంధించి 2 వేల టికెట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్ నే అనుమతిస్తున్నారు. దాంతో టికెట్ల సంఖ్యను కూడా తగ్గించారు.