జైల్లోకి వెళ్లకుండా ఉండాలంటే సుబ్రతా రాయ్ రూ. 62,600 కోట్లు కట్టాల్సిందే: సెబీ
- ప్రస్తుతం పెరోల్ పై బయటున్న సుబ్రతా రాయ్
- పెరోల్ ను రద్దు చేయాలంటూ సెబీ పిటిషన్
- ఈ డిమాండ్ అర్థరహితమన్న సహారా గ్రూప్
కాగా, ఎనిమిది సంవత్సరాల నాడు రూ.25,700 కోట్లుగా ఉన్న సుబ్రతా రాయ్ బకాయిలు, ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. సహారా గ్రూప్ కంపెనీలు చట్ట విరుద్ధంగా 3.5 బిలియన్ డాలర్లను సమీకరించిందని, ఈ ప్రక్రియలో సెక్యూరిటీస్ చట్టాలను కూడా ఉల్లంఘించారని సుప్రీంకోర్టు 2012లోనే తేల్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నుంచి ఈ డబ్బును సేకరించారని, సెబీ సైతం వీరందరినీ గుర్తించలేకపోయిందని, వారికి సహారా సంస్థలు తిరిగి డబ్బు చెల్లించలేదని, ఆ కారణంగానే ఆయన్ను జైలుకు పంపాల్సి వచ్చిందని సెబీ ప్రస్తావించింది.
కాగా, సెబీ చేసిన ఈ డిమాండ్ అర్థరహితమని సహారా గ్రూప్ ఓ ఈమెయిల్ స్పందనలో పేర్కొంది. సెబీ ఏకంగా 15 శాతం వడ్డీని కలిపిందని, తమ ఇన్వెస్టర్లలో చాలా మందికి ఇప్పటికే తిరిగి డబ్బును చెల్లించేశామని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ సుబ్రతా రాయ్ రూ. 15 కోట్లను కోర్టుకు జమ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందన్న విషయాన్ని కోర్టు ఇంకా నిర్ణయించలేదు.