పంజాగుట్ట ఫ్లయ్ ఓవర్ పై 'డిస్కో నైట్'... వైరల్ వీడియో ఇదిగో!
- త్వరలో గ్రేటర్ ఎన్నికలు
- అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వీధి దీపాలు
- చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉందంటున్న నెటిజన్లు
"పంజాగుట్ట ఫ్లయ్ ఓవర్ పై డిస్కో నైట్. ఎన్నికల సందర్భంగా దీన్ని జీహెచ్ఎంసీ స్పాన్సర్ చేసింది" అంటూ శ్రీనివాస్ బెల్లం అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ను, జీహెచ్ఎంసీని ట్యాగ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో, తమ ప్రాంతాల్లో సైతం ఇదే విధమైన పరిస్థితి నెలకొని వుందంటూ ఎంతో మంది వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.