కరోనా సెకండ్ వేవ్ వస్తోంది.. జాగ్రత్తగా ఉండాలి: జగన్

Jagan comments on Corona second wave
  • అనేక దేశాల్లో సెకండ్ వేవ్ నడుస్తోంది
  • స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం
  • జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సహా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. యూరప్ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఫ్రాన్స్, లండన్ లలో షట్ డౌన్ విధించారు. మన దేశంలో ఢిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మరో లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోందని జగన్ అన్నారు. అనేక దేశాల్లో సెకండ్ వేవ్ నడుస్తోందని చెప్పారు. అక్కడ ప్రారంభమైన వెంటనే మన దేశంలో కూడా అదే జరుగుతోందని అన్నారు. అందువల్ల మనకు కూడా సెకండ్ వేవ్ రాబోతోందని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిసెంబర్ 25న డీ-ఫామ్ ఇస్తూ ఇంటి స్థలం పట్టాలను ఇస్తామని జగన్ చెప్పారు. కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు. ప్రతిపక్షం కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని... అందువల్లే ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని చెప్పారు. టీడీపీ హయాంలో పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాలను కట్టబెట్టారని... ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్థలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దేవుడు మనకు అండగా ఉన్నాడని... ఈ యుద్ధంలో మనమే గెలుస్తామని అన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Corona Virus
Second Wave

More Telugu News