దుబ్బాక ఎమ్మెల్యేగా ఈ నెల 18న ప్రమాణస్వీకారం చేయనున్న రఘునందన్ రావు
- దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ ఘనవిజయం
- స్పీకర్ చాంబర్ లో ప్రమాణస్వీకారం
- రఘునందన్ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
కాగా, తీవ్రపోటీని తట్టుకుని రఘునందన్ రావు ఎన్నికల్లో జయభేరి మోగించిన నేపథ్యంలో ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆయన విజయంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే తమ టార్గెట్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.