మరోసారి రెచ్చిపోయిన పాక్... ఓ అధికారి, ఇద్దరు జవాన్లు వీరమరణం
- జమ్మూ కశ్మీర్ లో కాల్పులకు తెగబడిన పాక్
- మోర్టార్లు, ఇతర ఆయుధాలతో కాల్పులు
- ముగ్గురు సాధారణ పౌరులు కూడా మరణించిన వైనం
అంతేకాదు, బారాముల్లా జిల్లాలోని కామల్ కోటే ప్రాంతంలో ఇద్దరు సాధారణ పౌరులు కూడా చనిపోయారు. హాజీ పీర్ సెక్టార్ లో ఓ మహిళ కూడా పాక్ కురిపించిన గుళ్లవర్షానికి బలైంది. భద్రతా బలగాలకు చెందిన ముగ్గురి మృతిని అధికారులు నిర్ధారించారు. అయితే, పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ సాయుధ దళాలు జరిపిన కాల్పుల్లో 8 మంది పాక్ సైనికులు హతమయ్యారని వెల్లడించారు.