మరో సబ్ మెరైన్ 'వాగిర్'ను రంగంలోకి దించిన భారత్!

13-11-2020 Fri 11:15 | National
  • జాతికి అంకితమైన మరో జలాంతర్గామి
  • ముంబై మజగాన్ డాక్ లో కార్యక్రమం
  • పాల్గొన్న వైస్ అడ్మిరల్ ఆర్బీ పండిట్
భారత నావికా దళం శక్తి మరింతగా పెరిగింది. ముంబైలోని డిఫెన్స్ షిప్ యార్డ్ లో తయారైన ఫిఫ్త్ స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ వాగిర్ జాతికి అంకితమైంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారైన ఈ వరల్డ్ క్లాస్ జలాంతర్గామిని మజగాన్ డాక్ నుంచి సముద్రజలాల్లోకి పంపించారు. ఫ్రాన్స్ కు చెందిన నావెల్ డిఫెన్స్, ఎనర్జీ సంస్థ డీసీఎన్ఎస్ లు దీన్ని కల్వరి క్లాస్ సబ్ మెరైన్ గా రూపొందించాయి.

భారత నేవీకి జలాంతర్గాముల అవసరం అధికంగా ఉండటంతో ఈ తరహా సబ్ మెరైన్ లను మరిన్ని తయారు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇండియన్ నేవీ, డిఫెన్స్ పీఎస్యూలు ఎండీఎస్ఎల్ (మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్) నేతృత్వంలో దీన్ని తయారు చేశారు. మొత్తం ఆరు కల్వరి క్లాస్ సబ్ మెరైన్ లను తయారు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకూ ఐఎన్ఎస్ కల్వరితో పాటు ఖాంతేరి, కరాంగ్, వేలా పేర్లున్న సబ్ మెరైన్ లను తయారు చేసి, జాతికి అందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెస్ట్రన్ నావెల్ కమాండ్ చీఫ్, వైస్ అడ్మిరల్ ఆర్బీ పండిట్, మరో ఏడాదిలోగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావచ్చని, చివరి సబ్ మెరైన్ తయారీ అతి త్వరలోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఇక ఈ సబ్ మెరైన్ల నుంచి గాల్లోకి కూడా మిసైల్స్ పంపే అవకాశాలు ఉండటం గమనార్హం. సముద్ర జలాల్లో యుద్ధం చేయాల్సి వస్తే, వీటి వినియోగం కీలకం కానుంది.
INS VagirSubmerineKalvari Class

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more